English   

ఎన్టీఆర్ నోట 'జై బాలయ్య'...ఇదీ వైరల్ వీడియో అంటే !

Jr NTR shout Jai Balayya at SS Rajamouli's son Karthikeya's wedding
2018-12-30 15:39:38

ఒకానొక సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ల మధ్య విభేదాలు వచ్చాయని, వారు మాట్లాడుకోవట్లేదని మీడియా కోడై కూసేది, దానికి ఊతం ఇచ్చేలా వారు కూడా బహిరంగంగా కలుసుకున్న దాఖలాలు చాల తక్కువ. అయితే మంచో చెడో హరికృష్ణ మరణం బాబాయ్ అబ్బాయ్ లను కలిపిందనే చెప్పాలి. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత బాలయ్య ఎన్టీఆర్ సోదరులకి నాన్న‌లా మారిపోయాడు. ఆ మ‌ధ్య బాలయ్య ‘అర‌వింద స‌మేత’ స‌క్సెస్ మీట్‌ కు వ‌స్తే మొన్న ‘ఎన్టీఆర్’ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చాడు. అప్పటి నుండి నందమూరి అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వారి ఆనందాన్ని రేటింపు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు మ‌రోసారి బాబాయ్‌పై ఉన్న ప్రేమ‌ను చాటుకున్నాడు ఎన్టీఆర్. రాజ‌మౌళి త‌న‌యుడు పెళ్లి వేడుక‌లో సంగీత్ లో జై బాల‌య్య అంటూ ఎన్టీఆర్ అర‌వడం ఇప్పుడు వైర‌ల్ అయిపోతుంది. ఎవరో సెల్ ఫోన్ లో తీసిన ఆ వీడియోలో తారక్ ‘జై బాలయ్య’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నాడు. వీడియోలో తారక్ తో పాటు అఖిల్ అక్కినేని, జగపతి బాబుతో ఇంకా చాలా మంది నటులు కనిపిస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ వీడియోలో వైరల్ అవుతుంది. దీంతో నందమూరి అభిమానులకి పండగ పదిరోజుల ముందే వచ్చేసినట్టయ్యింది. 

More Related Stories