English   

కొరటాల శివకు బాలయ్య ఓకే !

Nandamuri  Balakrishna weight reduction for Koratala Siva Movie
2018-12-30 23:05:40

తాజాగా రామ్ చరణ్ హీరోగా ఈ సంక్రాంతికి రానున్న వినయవిధేయ రామ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిఇగ్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా హాజరయిన చిరంజీవి మాట్లాడుతూ తాను తర్వాతి చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే అంతకు ముందు దాకా అందరూ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనుకున్నారు, అయితే చిరంజీవి అలా చెప్పడంతో ఇక కొరటాల చిరంజీవి కాంబినేషన్ సినిమా ఉంటుందా ఉండదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఫిలిం నగర్ లో మొదలయిన ఒక టాక్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న బాలకృష్ణ తరవాత చిత్రం కోసం కొరటాల శివకు పచ్చ జెండా ఊపారట. ఇప్పటికే ఆయన బోయపాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేస్తున్నానని చెప్పాడట. కొరటాల తీయబోయే సినిమాలో కొడుకు, తండ్రి, తాతయ్య పాత్రలను బాలకృష్ణ పోషిస్తున్నారని, పాత్రల్లో తేడాను చూపించడానికి బరువు తగ్గాలని బాలకృష్ణను కొరటాల కోరారట. దీంతో తాను 25 కేజీల బరువు తగ్గుతానని బాలకృష్ణ మాటిచ్చారని ఫిల్మ్ నగర్ సమాచారం. పోసాని అల్లుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ రచయితా రాణించి దర్శకుడిగానూ మారి అన్నీ విజయాలు అందుకున్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి నాలుగు చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా మారిపోయారు. తీసే ప్రతి సినిమాలోనూ ఒక సందేశంతో సినిమాలు తీసే కొరటాల శివ బాలయ్యను తన హీరోగా ఎంపికచేసుకోవడమే హిట్ కొట్టినట్టు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Related Stories