English   

అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ టాక్ : మాస్ అమ్మ మొగుడు !

Ajith Kumar's Viswasam movie trailer talk
2018-12-30 16:09:53

అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘విశ్వాసం’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ‘వివేకం’ తర్వాత అజిత్‌ నటించిన చిత్రం ఇదే కావడంతో సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అజిత్‌, శివ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అజిత్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో అజిత్‌ తన యాక్షన్‌తో అదరగొట్టారు. నయనతార తన అందంతో ఆకట్టుకున్నారు. ఇందులో అజిత్‌ ఊరి జనం కోసం బతికే మనిషిగా హైలైట్ చేశారు.  తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమాలో అజిత్ కు జోడీగా నయనతార, ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ట్రైలర్ లో అజిత్ పక్కా యాక్షన్ తో అదరగొట్టేశాడు. కేవలం అజిత్ లోని మాస్ యాంగిల్ ని హైలైట్ చేస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌ రాజ్‌, యోగిబాబు తదితరులని కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ఉంది. గతంలో అజిత్‌, శివ  కాంబినేషన్‌లో ‘వీరం’, ‘వేదాలం’, వివేగం’ వచ్చాయి. ఆ నాలుగు కూడా బ్లాస్ బస్టర్ లే కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

More Related Stories