English   

అభిమానులకి సర్ప్రైజ్...బాలయ్య, రామ్ చరణ్ లుక్స్ !

balakrishna and ram charan movies look posters are out
2018-12-30 23:20:17

భారతదేశం నుండి బ్రిటీష్ వాళ్ళని తరిమికొట్టి మనకు స్వాతంత్యం అందించిన స్వతంత్ర్య యోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. అటువంటి మహానుభావుడి పాత్రను తన కెరీర్ లో చేద్దామనుకుని, చేయలేకపోయానని ఎన్టీఆర్ ఎన్నోమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన ముచ్చటను తీర్చుకునేందుకు 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో వచ్చే ఓ పాటలో కాసేపు అల్లూరిగా కనిపించారు కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం బాల‌కృష్ణ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా అల్లూరి పాత్రకి సంబంధించిన బాల‌య్య పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ పోస్టర్ ను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ పోస్టర్‌ లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ మాదిరే కనిపిస్తున్నారని చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక మరోపక్క వినయ విధేయ రామలో మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు రామ్ చరణ్‌ ను ఎవరూ చూడని విధంగా చేతిలో మెషీన్ గన్, కండలు తిరిగిన దేహం, భుజాలు, చాతిపై టాటూలతో కూడిన ఒక పిక్ విడుదల చేసారు. దీంతో రామ్ చరణ్ ని రాంబో ఫైవ్ తో పోలుస్తూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories