English   

బ్రోచేవారెవరురా....అప్పటిదాకా వేచి ఉండండి !

sree vishnu next film brochevarevarura
2018-12-31 09:03:09

చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు శ్రీ విష్ణు. కెరీర్ మొదటిలో స్టార్ హీరోల పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేసినా తర్వాత తర్వాత తను ఎంచుకునే కధలలో వైవిధ్యంతో ఒక మార్క్ ఏర్పరచుకున్నాడు. ఈ ఏడాది ఆయన హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మనముందుకు వచ్చి ప్రతి కుర్రవాడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపి మెప్పించాడు. అయితే ఆయన తదుపరి చిత్రం ఏముంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఒక తాజా అప్డేట్ వినిపిస్తోంది. ఆయన హీరోగా గత ఏడాది రిలీజయిన మెంటల్ మదిలో అందరికీ గుర్తుండే ఉంటుంది, కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా డైరెక్టర్  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘బ్రోచేవారెవరురా’ టైటిల్ తో సినిమా ఓకే అయ్యిందట. నివేథా థామస్, నివేథా పేతురాజ్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో మన్యం ప్రొడక్షన్స్‌ పతాకం మీద విజయ్‌ కుమార్‌ మన్యం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రకటించింది. కొంటెవాడు శ్రీ విష్ణు, కొంటెది నివేద థామస్, విధేయుడు సత్యదేవ్, విలక్షణనటి నివేద పేతురాజ్ భయభ్రాంతుడు రాహుల్ రామకృష్ణ, తింగరోడు ప్రియదర్శి తదితరులు నటించిన అసలు విషయం రేపు 31న ఉ.10 గంటలకు. అప్పటిదాకా వేచి ఉండండి ! అదే, stay tuned’’ అంటూ చిత్రం బృందం ఓ పొస్టర్‌ని విడుదల చేసింది. 

More Related Stories