English   

న్యూయర్ కి 'మహర్షి ' టీమ్ సర్ప్రైజ్ !

Time Locked for Mahesh Babu Maharshi’s Second Look
2018-12-31 03:40:17

వంశీ పైడిప‌ల్లి ద‌రక‌త్వంలో ప్రిన్స్ మహేష్‌ బాబు నటిస్తోన్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించి మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ తప్ప ఆ తరువాత మరే అప్డేట్ అధికారికంగా రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇంకొక హాట్ అప్‌డేట్ వచ్చేసింది. ‘ఈ కొత్త సంవత్సరం రిషి తో సెలెబ్రేట్ చేసుకోండి. రిషి కొత్త డైమెన్షన్ ని రేపు ఇదే టైం కి చూడండి’ అని నిన్న సాయంత్రం వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. అంటే మహేష్‌ తన అభిమానులకి కొత్త సంవ‌త్స‌రం గిఫ్ట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారన్నమాట. ప్రస్తుతం మహర్షి షూటింగ్ నిరాటంకంగా జరుగుతోంది. కానీ కొత్త సంవత్సర వేడుకల కోసం చిన్న బ్రేక్ తీసుకున్నారు మహర్షి టీం. ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోయే ఈ సినిమాను అశ్విని దత్, దిల్ రాజు, పివిపి సంస్థలు మూడూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ మహేష్ బాబుకు స్నేహితుడు రవిగా కనిపించనున్నారు.

 

More Related Stories