English   

రాజమౌళి కోడలి పల్లకీని మోసిన ప్రభాస్ !

Prabhas
2018-12-31 14:25:00

దర్శక దిగ్గజం రాజమౌళి కొడుకు కార్తికేయ, జగపతిబాబు అన్న కూతురు పూజా ప్రసాద్‌ ల వివాహం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ లోని జయపుర‌ పట్టణంలోని ఓ ప్యాలెస్‌ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదిక కాగా చాలా తక్కువ మంది సన్నిహుతులు అతిధుల ఆశీర్వాదాల నడుమ వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మూడు రోజుల ముందే చేరుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు జైపూర్ చేరుకుని సందడి చేశారు. ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంగీత్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ దుమ్మురేపే డ్యాన్సులు చేశారు. అలా ఈ వేడుకకి సంబందించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో వీడియో వైరల్ అయ్యింది అదేంటంటే పెళ్లి మండపానికి వధువును తీసుకొస్తున్న పల్లకీని బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కలుపుగోలుతనం చూసిన నెటిజన్లు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ పెళ్లి వేడుకలో ప్రభాస్, అనుష్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాస్తవానికి వారిద్దరి పెళ్లి గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి, అవన్నే పక్కన పెడితే ఇద్దరూ పెళ్లి మొత్తానికి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. 

More Related Stories