English   

ర‌జ‌నీ కాంత్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్...తెలుగు ట్రైలర్ !

Rajinikanth
2018-12-31 10:11:38

తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'పేట' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. విడుదలకి తక్కువ రోజులే ఉండడంతో జోరుగా ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్, తాజాగా తెలుగులోను స్పెషల్ ట్రైలర్ ను వదిలారు. న్యూ ఇయ‌ర్ విషెస్ చెబుతూ సంక్రాంతికి పేట‌లో క‌లుస్తాను అని ర‌జ‌నీకాంత్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది.

చూడబోతున్నారుగా .. కాళి ఆట. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ మీ పేటలో కలుస్తాను .. అప్పటివరకూ 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ రజనీ తెలుగు అభిమానుల కోసమే అన్నట్టుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి రజనీ చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి తెలుగులో కధానాయకుడు, వినయ విదేయ రామ, ఎఫ్ 2 వంటి చిత్రాలు విడుదలకి ఉన్నాయి. ఇక చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటివారంలో భారీఎత్తున నిర్వహించనున్నట్లు స‌మాచారం. పేటలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.  

More Related Stories