English   

ఎట్టకేలకు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు..!

Allu-Arjun
2018-12-31 17:45:43

ఎప్పుడా ఎప్పుడా అని బన్నీ అభిమానులు చూస్తున్న ఎదురు చూపులకి ఫలితం దక్కింది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ తరవాత దాదపుగా ఇంటికే పరిమితమైన బన్నీ చాలా ఆప్షన్స్ తీసుకునట్టు వార్త్జలు వచ్చాయి. అయితే చివరికి తన అభిమానులు ఏమాత్రం డిజప్పాయింట్ అవకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే మొగ్గుచూపాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా పట్టాలెక్కుతోంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బ్లాక్ బస్టర్ లు కావడంతో ఇప్పుడు ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. మరి ఆ అంచనాలను అందుకోవాలంటే ఒక్క ప్రొడక్షన్ హౌస్ చాలదు అనులున్నారో ఏమో బన్నీ సొంత ప్రొడక్షన్ అయిన గీతాఆర్ట్స్ త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ లాంటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. 2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని చెబుతూ న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. 

More Related Stories