English   

జెర్సీతో నాని సిక్స‌ర్ కొడ‌తాడా.. ఔట్ అవుతాడా..? 

JERSEY
2018-12-31 18:32:32

వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని చేస్తున్న సినిమా జెర్సీ. 2018 నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాసు సినిమాలో అనుకున్న అంచనాలు అందుకోలేదు. దాంతో ఇప్పుడు నాని ఆశలన్నీ జెర్సీ సినిమాపైనే ఉన్నాయి. మళ్ళీరావా దర్శకుడు గౌతమ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జనవరి 1 సందర్భంగా ఈ చిత్రం మరో లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో క్రికెటర్ గా నటిస్తున్నాడు న్యాచురల్ స్టార్. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న నాని ఫోటోలు విడుదల చేశారు. ఈ చిత్రం కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు నాని. 80 దశ‌కంలో సాగే కథతో జెర్సీ తెర‌కెక్కుతుంది. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి ఎలా వచ్చాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గౌతమ్. 

కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని తనకు మంచి విజయాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాడు నాని. వరుసగా ఎనిమిది విజయాలతో జోరుమీదున్న స్పీడ్ కు 2018 బ్రేకులు వేసింది. దాంతో 2019లో మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు నాచురల్ స్టార్. దానికోసమే కొత్త కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు నాని. ఈ చిత్రం తర్వాత విశాల్ హీరోగా మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. యాత్ర ఫేమ్ మ‌హి వి రాఘ‌వ దీనికి ద‌ర్శ‌కుడు. మొత్తానికి రొటీన్ కథలు దెబ్బకొట్టేస‌రికి.. సరికొత్త అడుగులు వేస్తున్నాడు. నాని ఏప్రిల్ 19న జెర్సీ విడుదల కానుంది.

More Related Stories