English   

విశాల్ పెళ్లి .. వ‌ధువు ఎవ‌రో గెస్ చేయండి..? 

Vishal
2018-12-31 11:44:03

టాలీవుడ్ లో ప్రభాస్.. కోలీవుడ్లో విశాల్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురుకి ఓకే కామన్ క్వ‌శ్చ‌న్ ఎదురవుతూ ఉంటుంది. మీ పెళ్లెప్పుడు అని. దీనికి వీలు కూడా కామన్ గా ఒకే సమాధానం చెబుతున్నారు.. కుదిరినప్పుడు అని. ఇప్పుడు సల్మాన్ ఖాన్, ప్రభాస్ కు ఇంకా కుదిరే టైమ్ రాలేదు కానీ విశాల్ కు మాత్రం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ హీరో త్వ‌ర‌లోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు ఆయన తండ్రి జీకే రెడ్డి. విశాల్ పెళ్లి కుదిరిందని త్వరలోనే నిశ్చితార్థం ఉంటుందని తెలిపాడు రెడ్డి. అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి జరగబోతుందని చెప్పాడు ఈయ‌న‌. ఇంతకుముందు విశాల్ పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టిన తర్వాత చేసుకుంటాను అని చెప్పేవాడు.

ఇప్పుడు ఆ బిల్డింగ్ పనులు మొదలైపోయాయి.. త్వరలోనే పూర్తి కానున్నాయి కూడా. దాంతో విశాల్ పెళ్లి గురించి టాపిక్ మరోసారి మొద‌లైంది. దానికి తోడు వరలక్ష్మి కూడా తాము కేవలం స్నేహితులు మాత్రమే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పింది. వరలక్ష్మి గురించి విశాల్ కూడా ఇదే చెప్పాడు. దాంతో విశాల్ కోసం మరో అమ్మాయిని చూశారు తల్లిదండ్రులు. వచ్చే ఏడాది వేసవి లోపు విశాల్ కచ్చితంగా ఓ ఇంటివాడు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నడిగర్ సంఘం వివాదాల మధ్య కొట్టుమిట్టాడుతున్న త్వరలోనే దీని నుంచి బయటికి వచ్చి పెళ్లి క‌బురు చెబుతాడ‌ని ఆశిస్తున్నారు అభిమానులు. మరి చూడాలి విశాల్ పెళ్లి ఎప్పుడైనా జరుగుతుందో లేదో.

More Related Stories