English   

బాల‌య్య ఎడ‌మ క‌న్ను ర‌హ‌స్యం.. కంటికి క‌న‌బ‌డ‌ని నిజం..

balakrishna left eye secrete
2018-12-31 16:11:34

పైకి మనకు కనిపించే అన్ని నిజాలు కావు.. కంటితో చూసే ప్రతిదీ నిజము కాదు. ఇప్పుడు బాలయ్య చెప్పిన సమాధానం విన్న తర్వాత అందరికీ ఇదే అనిపిస్తుంది. ఈయనకు రెండు కళ్ళలో ఒకటి కనిపించదు. ఈ విషయం నమ్మడానికి కూడా విచిత్రంగా ఉంటుంది కానీ ఇది నిజం. బాలయ్య ఎడమ కన్ను కనిపించదు ఈ విషయం చెప్పింది కూడా ఆయనే. తాజాగా రానా నెంబర్ వన్ యారి షో కు వచ్చిన బాలకృష్ణ తన పర్సనల్ విషయాలు చాలానే పంచుకున్నాడు. అందులో భాగంగానే తన ఎడమ కంటి రహస్యాన్ని కూడా ప్రేక్షకుల ముందుంచారు బాలయ్య. భైరవద్వీపం షూటింగ్ సమయంలో మేకప్ వేసుకున్న టైం లో తన కంటికి చిన్న సమస్య వచ్చిందని.. కురూపి షూటింగ్ మేకప్ కోసం అంత సిద్ధం చేసుకున్న సమయంలో అనుకోకుండా నిద్రపోయానని.. అప్పుడు రసాయన పదార్థాలు కంట్లో ప‌డ్డాయ‌ని చెప్పాడు బాలయ్య.
దానికి ముందు నుంచే తన ఎడమ కంటికి సైట్ ఉందని.. కాకపోతే కుడి కన్ను అద్భుతంగా పని చేయడంతో తనకు ఎప్పుడూ ఆ సమస్య రాలేదు.. కంటి చూపు సమస్య ఉన్నట్లు ఫీల్ కాలేదని చెప్పారు బాలకృష్ణ. ఇక్కడ విచిత్రం ఏంటంటే రానాకు కూడా ఎడ‌మ క‌న్ను కనిపించదు. ఆయనకు ఉన్నది కాంటాక్ట్ ఐ. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో తన ఎడమ కంటిని పోగొట్టుకున్నాడు రానా. ఇప్పుడు ఆయనకు ఉన్న‌ది పెట్టుడు కన్ను. ఆ మధ్య దీనికోసమే అమెరికా వెళ్లి ఆపరేషన్ కూడా చేయించుకుని వచ్చాడు రానా. మొత్తానికి రానా షోలో తన కంటి గుట్టు బయట పెట్టాడు బాలకృష్ణ. ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు. ఇందులో భాగంగానే కూడా వచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో రానా కూడా నటించాడు. చంద్రబాబు నాయుడు పాత్రలో ఎన్టీఆర్ అల్లుడుగా అద్భుతంగా నటించాడు అంటూ కితాబిచ్చాడు దర్శకుడు క్రిష్.

More Related Stories