English   

వినాయ‌క్, బాల‌య్య మ‌ధ్య ఏం జ‌రుగుతుంది..?

vv vinayak direct  movie with  venkatesh second time
2018-12-31 23:23:26

వినాయ‌క్ ను బాల‌య్య వద్దనుకున్నాడా.. కావాలనే ఈ ద‌ర్శ‌కున్ని బాల‌య్య దూరం పెడుతున్నాడా.. ఏమో ఇప్పుడు ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది మరి. ఒకప్పుడు వినాయక్ సినిమా అంటే హీరోలంతా సై అనేవాళ్ళు.. కానీ ఇప్పుడు నై అంటున్నారు. దానికి కారణం ఆయన పరాజయాలే. కొన్నేళ్లుగా ఈ ద‌ర్శ‌కుడి కెరీర్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నాయక్ సినిమా తర్వాత ఈయనకు ఒక్క విజయం కూడా రాలేదు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా అది చిరు మేనియాలో నడిచిన సినిమా. పైగా రీమేక్ సినిమా. దాంతో వినాయ‌క్ కు ఈ చిత్రంతో పెద్దగా ఒరిగిందేమీ లేదు. అల్లుడు శీను, అఖిల్, ఇంటలిజెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో వినాయ‌క్ ఉన్నాడ‌నే సంగ‌తే చాలా మంది హీరోలు మ‌రిచిపోయారు.
కథ బాగుంటే హిట్టు ఫ్లాపులు చూడని బాలకృష్ణను త‌న క‌థతో ఒప్పించాడు వినాయక్. ఈ కాంబినేష‌న్ లో సినిమా కూడా అనౌన్స్ అయిన త‌ర్వాత ఆయ‌న‌ అనూహ్యంగా క్రిష్ వైపు వెళ్ళాడు. ఆయనతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.. మహానాయకుడు ఫిబ్ర‌వ‌రి 7న రానుంది. ఇది సెట్స్ పై ఉండ‌గానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఈ చిత్రాన్ని ఆయన సొంతంగా నిర్మిస్తున్నాడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే వినాయక్ సినిమా ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్ కూడా అలాగే ఉంది. దాంతో ఈ ద‌ర్శ‌కుడు కూడా ఇప్పుడు బాలయ్యను కాదని మరో హీరోని పట్టుకున్నాడు.
సీనియర్ హీరో వెంకటేష్ తో వినాయ‌క్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 12 ఏళ్ల‌ కింద ఈ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మీ సూపర్ హిట్ అయింది. మళ్లీ అదే మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేయాలని చూస్తున్నాడు వినాయక్. ప్రస్తుతం ఎఫ్ 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు వెంకటేష్. ఆ తర్వాత వినాయక్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. బాబీ దర్శకత్వంలో వెంకీ మామ సినిమా కూడా క‌మిటైనా.. ఆ సినిమా ఇప్పట్లో ప‌ట్టాలెక్క‌డం కష్టంగానే కనిపిస్తోంది. దాంతో అడుగుల వినాయక్ వైపు వెంకీ అడుగులు ప‌డుతున్నాయి. మ‌రి ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా లక్ష్మి ని మించి ఆడుతుందో లేదో చూడాలి.

More Related Stories