English   

వారెవ్వా.. ఏం చెప్పారు దిల్ రాజు గారూ..?

dil raju about f2 movie
2018-12-31 16:31:51

నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు దిల్ రాజు. ఈయన నిర్మించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకుడు. పండక్కి కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు దిల్ రాజు. ఇదే విషయాన్ని ఆడియో వేడుకలో కూడా అభిమానుల ముందు బాగా చెప్పాడు ఈ నిర్మాత‌. అయితే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వీటి గురించి కూడా ఓపెన్ అయ్యాడు దిల్ రాజు. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా తన సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఈ నిర్మాత.
దానికి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కారణమని.. కచ్చితంగా రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారని కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు రాజు. పైగా అనిల్ రావిపూడి కూడా హ్యాట్రిక్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. తాను వరుసగా నాలుగో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్, వెంకటేష్ ఇందులో తోడ‌ల్ల‌ళ్ళుగా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత పెళ్లికి ముందు అనే సరదా కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న సంక్రాంతి అల్లుళ్లు థియేటర్లలోకి రానున్నారు. ఇదిలా ఉంటే జనవరి 9 నుంచి 12 వరకు వరుసగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
దాంతో డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు అయితే ఎవరు ఎంత టెన్షన్ పడినా కూడా పండక్కి ఎన్ని సినిమాలు వచ్చిన విజయం సాధించగల సత్తా ఉంటుందని అది ఈ సీజన్ మహిమ అంటున్నాడు దిల్ రాజు. దీనికి 2017 సంక్రాంతి నిదర్శనం అని.. అప్పుడు వచ్చిన ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి సినిమాలు విజయం సాధించాయ‌ని చెప్పాడు దిల్ రాజు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది రాసుకోండి అంటున్నాడు ఈ నిర్మాత. ప్రతి ఒక్కరు తమ సినిమాతో పాటు మిగిలిన మూడు సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మ‌రి వాళ్ల నమ్మకాలు సంక్రాంతికి ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

More Related Stories