English   

విశాల్ రిలేష‌న్ పై ఓపెన్ అయిన వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్ కుమార్..

Varalaxmi Sarathkumar open about relationship with vishal
2018-12-31 23:38:54

విశాల్ ను పెళ్లి చేసుకుంటాను అని నేను ఎప్పుడైనా చెప్పానా.. ఏదైనా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చానా.. మరి ఎందుకు ప్రతిసారి విషయాల గురించి నన్ను అడుగుతుంటారు.. తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఏమీ లేదు.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. కొన్నేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు సౌత్ ఇండస్ట్రీ లో జోరుగా వినిపించాయి. వీళ్ళ ప్రేమను అంగీకరించనందుకే శరత్ కుమార్ తో విశాల్ కు గొడవలు అనే వాదన కూడా ఉంది. అయితే ఇవన్నీ గతం. ఇప్పుడు విశాల్, వరలక్ష్మి విడిపోయారు. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు ఏమీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వరలక్ష్మి మాత్రం మరోలా స్పందిస్తుంది.
విడిపోవడానికి అసలు కలిస్తే కదా.. ఎప్పుడు విశాల్ త‌న‌కు మంచి స్నేహితుడు  మాత్ర‌మే అని.. ఇన్నాళ్లూ కూడా అలాగే ఉన్నామ‌ని.. అంతకు మించి ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది వర‌ల‌క్ష్మి. విశాల్ తో పెళ్లి పుకార్లపై కూడా నోరు విప్పింది ఈ ముద్దుగుమ్మ. అలాంటిదేమీ లేదని అది కేవలం మీడియా సృష్టి మాత్రమే అని చెప్పింది వరలక్ష్మి. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో రెచ్చిపోతుంది వరలక్ష్మి. హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఆ మధ్య విడుదలైన పందెంకోడి 2లో విశాల్ కు విలన్ గా నటించింది వరలక్ష్మి. ఇక సర్కార్ సినిమాలో కూడా కోమల‌వల్లి పాత్రలో అదరగొట్టింది ఈ భామ‌. మొత్తానికి వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ పెళ్లి టాపిక్ వచ్చేసరికి మాత్రం నో అంటుంది.

More Related Stories