English   

ఇద్దరు హీరోలను అవమానించిన స్టార్ డైరెక్టర్ !

Ravi Teja and Sai Dharam Tej hurt  Harish Shankar's decision
2019-01-01 08:33:50

ఆయనో స్టార్ డైరెక్టర్, గత ఏడాది హిట్ అయిన ఓ పెద్ద హీరో సినిమా తర్వాత ఇంకే అవకాశం తలుపు తట్టలేదు. తన సినిమాలో కంటెంట్ లేకపోగా ఆ కంటెంట్ లేకపోవడాన్ని క్రిటిక్స్ విమర్శించారని వారి మీద నానా రకాలుగా నోరు పారేసుకున్న ఆయన ఎవరో ? గుర్తొచ్చారా ? ఆయనేనండీ హరీష్ శంకర్. దువ్వాడ జగన్నాధం సినిమా తర్వాతా ఏడాదిన్నరగా ఈయన ప్రాజెక్ట్ కోసం ఎక్కని స్టార్ హీరో ఇంటి మెట్లు లేవు. కానీ ఇప్పటికీ దేవుడు కరుణించలేదు. తాజాగా మరో వార్త ఆయన వివాదాస్పద శైలిని మరోసారి బయటపెట్టింది. రెండేళ్ల క్రితం తమిళ్ లో హిట్ కొట్టిన 'జిగర్తాండ' సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో తమిళ మాతృకలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్ర కోసం రవితేజను కలవగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే ఇక హీరో సిద్ధార్థ్ పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ ను కలవగా ఆయన కూడా సరే అన్నాడట. అయితే, ఇప్పుడు ఏమయిందో ఏమో వీరిద్దరినీ కాదని వరుణ్ తేజ్, నాగశౌర్యలతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడని టీటౌన్ టాక్. అయితే తాకు లైన్ చెప్పి తాము ఓకే చెప్పినప్పటికీ తమకి మాట మాత్రమైనా చెప్పకుండా హరీశ్ శంకర్ ఇలా వేరే హీరోలను అప్రోచ్ అవడం వలన, రవితేజ, సాయిధరమ్ తేజ్ ఫీలవుతున్నట్టుగా వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. స్టార్ డం ల సంగతి పక్కన పెడితే ఇలా కమిట్ అయిన తర్వాత హీరోలను మారిస్తే ఎంత సిగ్గు చేటు ? తాను తిట్టినా క్రిటిక్స్ వేలెత్తి చూపుతారని కూడాలేకుండా హరీష్ ఇంత ధైర్యం చేశాడు ఎందుకో ?

More Related Stories