English   

సినీప్రియులకి గుడ్ న్యూస్...నేటి నుండే టికెట్ ధరలు తగ్గింపు !

New GST rates  effect from January 1, television sets and movie tickets get cheaper
2019-01-01 10:58:52

కొత్త సంవత్సరం వచ్చీ రాగానే సినీ ప్రేమికులకు శుభవార్తను అందించింది. అదేంటి ఇప్పుడేమి శుభవార్త అనుకుంటున్నారా, తాజాగా ప్రభుత్వం తగ్గించిన సినిమా టిక్కెట్ల మీద జీఎస్టీ ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. పలు వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో గత నెల 22న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ సమావేశంలో భాగంగా సినిమా టికెట్లు, టీవీల ధరల మీద నూతన జీఎస్టీ స్లాబ్ విధానం నేటి నుంచి అమలు కావడంతో సినిమా వాటి ధరలు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు వంద రూపాయలకు పైన ఉన్న టికెట్‌పై 28 శాతం పన్ను ఉండగా నేటి నుంచి అది 18 శాతంగా ఉండనుంది. అలాగే వంద రూపాయల లోపు టికెట్‌ పై ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేయగా, నేటి నుంచి 12 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు.అంటే ఇక నేటి నుంచి వినోదం మరింత చవక కానుంది. అలాగే, కంప్యూటర్ మానిటర్లు, 32 అంగుళాల టీవీ స్క్రీన్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇవి కాక పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌లు, వీడియో గేమ్‌ పరికరాలు కూడా ఉన్నాయి.

More Related Stories