English   

సంపూ మోస్ట్ వాంటెడ్ @ ఇండోనేషియా !

netflix indonesia is going to bananas over this telugu movie clip
2019-01-01 11:13:12

హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంపూర్నేష్ బాబు, తన విలక్షణ శైలితో పాపులర్ అయ్యాడు. విచిత్రమైన సినిమాలను మాత్రమె చేస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్న ఆయన ఇప్పుడు ఇండోనేషియా సినిమా అభిమానులకి మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ఆయన అక్కడ ఫేమస్ అయినా ఆయన పేరు వివరాలు వారికి తెలియదు, దీంతో ‘నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా’ అతను నటించిన సినిమాలు తమకు తెలియచేయాలి అంటూ కావాలంటూ ‘నెట్‌ఫ్లిక్స్’ ఇండియాకు రిక్వెస్ట్ పంపింది. దీని బట్టి ఆయన క్రేజ్ అక్కడ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు, ఇంతకీ సంపూకి అక్కడ అంత డిమాండు రావడానికి కారణం ఏమిటా అని బుర్రలు చించుకునేరు !, అలా క్రేజ్ రావడానికి కారణం ఒక ఫైట్ సీన్. 2015లో సంపూ హీరోగా మంచు బ్రదర్స్ ప్రొడక్షన్ లో వచ్చిన సింగం 123 సినిమాలో ఓ ఫైట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఫైట్‌లో సంపూ అరటి పండును కత్తిలా వాడటం, కోడిని బాణంలా విసరడం వంటి పొట్ట చెక్కలయ్యే సీన్ లు ఉంటాయి. దీంతో ఈ ఫైట్ చూసినవాళ్లు కడుపుబ్బా నవ్వుకోవడంతోపాటు ఆ సినిమా గురించి తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా ఘోర ప్లాప్ గా మిగిలినా ఈ సీన్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి బాగా వాడేవారు అలా అది అలా అలా ఇండోనేషియా దాకా పాకింది. ఈ సీన్ అక్కడ వైరల్‌‌గా మారడంతో ఆ సినిమాని తమ లోకల్ భాషల్లోకి డబ్ చేసి వదిలితే బెటర్ అనుకుందో ఏమో ‘నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా’ వెంటనే రంగంలోకి దిగి ఆ సినిమా మొత్తం తాము చూడాలనుకుంటున్నామని, ఇందుకు సాయం చేయండని ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’కు ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

More Related Stories