English   

ప్రియా వారియర్ 'లవర్స్ డే' ఫస్ట్ లుక్

priya varrier's lovers day first look out
2019-01-01 12:09:17

ఒక్కసారి అలా కన్నుగీటి ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. భాష, ప్రాంతం అని తేడా లేకుండా ఇండియా మొత్తాన్ని ఒక ఊపిన ఈ కేరళ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రియా కోసం ప్రయత్నిస్తున్నారని మెగాహీరోలతో పాటు అక్కినేని అఖిల్ సరసన ఈ కేరళ భామ నటించబోతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ వార్తల మీద తర్వాత అదికారిక ప్రకటనలు వెలువడనప్పటికీ ఆమె కన్ను గీటుకి కారణమయిన 'ఒరు ఆదార్ లవ్' మలయాళ సినిమాని త్వరలో తెలుగులోను విడుదల చేస్తున్నారు. 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కన్ను గీటుతో పాటు ఆమె లవ్ తుపాకీ పేల్చుతున్నట్లు పోజు ఇచ్చి మరో మ్యాజిక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అదే ఫస్ట్ లుక్ గా ఈ పోస్టర్ వదిలారు. మళయాళ సినిమా అక్కడి వాళ్ళని ఆకట్టుకోగా తెలుగు వర్షన్ ఏమి మాయ చేయనుందో ?

More Related Stories