English   

ఎన్టీఆర్ బయోపిక్ లో కొత్త లుక్...బసవతారకం సమేత !

NTR-biopic
2019-01-01 14:19:12

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్'లో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ నుండి ఈ రోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక పోస్టర్ విడుదల చేసింది. నూతన సంవత్సరాది అలాగే విద్యా బాలన్‌ పుట్టినరోజు కూడా కలిసిరావడంతో ఈ స్పెషల్ లుక్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ పాత్రధారి బాలకృష్ణ తన సతీమణి బసవతారకం పాత్రధారి విద్యా బాలన్‌ తో కలిసి బాల బాలకృష్నుడి పాత్రధారి ఒరిజినల్ బాలయ్య రెండో కూతురి కొడుకు ఆర్యవీర్ కు బాలకృష్ణగా నామకరణం చేస్తున్నట్లుగా దర్శనమిస్తున్నారు. ఈ పోస్టర్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఆసక్తికరమైన పోస్టర్‌ను చూసిన బాలయ్య అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ‘కథానాయకుడు’, ‘మహా నాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా విడుఅలకి సిద్దమవుతోంది.  

More Related Stories