English   

బొమ్మ సూపర్ హిట్...అదరగొడుతున్న హిందీ టెంపర్..

Simmba
2019-01-01 10:59:10

తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా బాలీవుడ్ ను మన సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. బాహుబలి సినిమా లో అయితే అక్కడికి వెళ్లి వాళ్ల రికార్డులను తిరగరాసి ఇక్కడికి వచ్చాయి, ఇక ఇప్పుడు మన సినిమా మరోటి బాలీవుడ్లో సత్తా చూపిస్తుంది. అదే టెంపర్ మూడేళ్ల కింద ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ కాకపోయినా మంచి సినిమాగా మిగిలిపోయింది. వరుస ఫ్లాపులతో ఉన్న ఎన్టీఆర్ కెరియర్ కు ఊపిరి పోసింది టెంపర్. ఇప్పుడు ఇదే సినిమాను బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ రీమేక్ చేశాడు. అక్కడ రోహిత్శెట్టి ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథను మార్చి తెరకెక్కించాడు.

ప్రస్తుతం టెంపర్ రీమేక్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది, మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు సాధించి రణవీర్ సింగ్ కెరీర్లో మరో విజయం గడిచిపోయింది. టెంపర్ రీమేక్ తెలుగు తో పోలిస్తే హిందీలో కాస్త తక్కువగానే ఉన్నా, కూడా అక్కడి ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది ప్రేక్షకులకు ఒరిజినల్ చూసిన ఫీలింగ్ ఉండటంతో ఈ చిత్రం అంతగా ఎక్కట్లేదు. కానీ హిందీ లో మాత్రం టెంపర్ రీమేక్ సత్తా చూపిస్తుంది. రన్వీర్ సింగ్ నటనకు తోడు హీరోయిన్ గ్లామర్ కూడా ఈ సినిమాకు ప్లస్ గా మారింది. దానికితోడు బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం సింబా సినిమాకు కలిసొస్తుంది. ఈ చిత్రం ఫుల్ రన్లో కచ్చితంగా 200 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. పైగా ఇప్పుడు రణ్వీర్ సింగ్ కు ఉన్న ఇమేజ్ అలా ఉంది, అదే ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది మొత్తానికి మన సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఇప్పుడు కుమ్మేస్తుంది.

More Related Stories