English   

వినయ కుటుంబ రాముడు...చరణ్ పోస్టర్స్ అదుర్స్

VVR
2019-01-01 11:12:04

సినిమాల్లో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి చూపిస్తే ఒప్పుకోడానికి ప్రేక్షకులు అంత పిచ్చి వాళ్ళు కాదు, వాళ్లకు నిజాలు చూపిస్తే సినిమా విడుదలైన తర్వాత నెత్తిన పెట్టుకుంటారు లేదంటే నేలకేసి కొడతారు. ఇంత చిన్న విషయం బోయపాటి శ్రీను మర్చిపోతారని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఈయన తన కొత్త సినిమా వినయవిధేయత ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం లో ఏముందో ఇప్పుడిప్పుడే పోస్టర్స్ విడుదల చేసి ప్రేక్షకులకు చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. 

మొన్నటి వరకు విడుదలైన ట్రైలర్ టీజర్ అన్ని మాస్ ప్రేక్షకుల కోసం అయితే, ఇప్పుడు విడుదలవుతున్న పోస్టర్స్ ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం. ఫ్యామిలీ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కుటుంబంతో ఉన్న లుక్ విడుదల చేశారు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామ కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఇందులో ఎమోషన్స్ చాలానే ఉన్నాయి. అసలు బోయపాటి సినిమా అంటేనే ఎమోషన్స్ తో నడుస్తుంది ఈయన సినిమాల్లో కథ కంటే ఎక్కువగా ఎమోషన్ కీలకపాత్ర పోషిస్తుంది. సరైనోడు సినిమా దీనికి నిదర్శనం. ఆ తర్వాత జయజానకినాయక కూడా అంతే ప్రతి సినిమాలోనూ ఎమోషన్స్ తోనే ఆడుకుంటాడు బోయపాటి. ఇప్పుడు చరణ్ సినిమా లోనూ ఇదే చేస్తున్నాడు, దాంతోపాటే మాస్ ఆడియన్స్ కావాల్సిన అన్ని మసాలాలు దట్టించి సినిమాను తీసుకొస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ చిత్రం కచ్చితంగా సంక్రాంతి పండక్కి ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది అని చెబుతున్నాడు దర్శకుడు. వాళ్ల కోసం తీసిన సినిమా ఇదని కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి విందుభోజనం తిన్నంత హాయిగా థియేటర్ నుంచి బయటకు వస్తారని చెబుతున్నాడు. 

తాజాగా విడుదలైన పోస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి ఈ చిత్ర బిజినెస్ దాదాపు 90 కోట్లకు పైగా జరిగింది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి, మరి వీటన్నింటినీ వినయ విధేయ రామ నిలబెడుతుందో లేదో చూడాలి.

More Related Stories