English   

అనసూయ గుండెల మీద టాటూకి అర్ధం ఇదేనట !

Anchor-Anasuya
2019-01-02 04:08:48

తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతోన్న యాంకర్లలో అనసూయ ఒకరు. తొలుత జబర్దస్త్ యాంకర్‌ గానే బుల్లితెరలో సందడి చేసినా కొందరు దర్శకుల పుణ్యమా అని ఆమె వెండితెరపై కూడా నటిగా ఆమె రాణిస్తోంది. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి, ఆ సినిమా వచ్చిన తరవాత ఆమె అసలు పేరు అనసూయ బదులు ఆమెని చాలా మంది రంగమ్మత్త అనే ఫిక్సయిపోయారు. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఈ భామ పడచు భామలకు పోటీ నిస్తూ మోడరన్, ట్రెడిషనల్ ఏ లుక్‌లో అయినా ఒదిగిపోతోంది. అయితే ట్రెడిషనల్  లుక్ లో కనపడకపోవచ్చు కానీ ఆమె ఏదైనా మోడరన్ డ్రెస్ వేస్తే గుండెల మీద ఒక టాటూ కనిపిస్తూ ఉంటుంది. ఆ టాటూ మనకి క్లారిటీగా కొన్ని ఫోటోలలో కనిపించినా ఆ పేరు ఏంటి దానికి అర్ధం ఏమిటనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. తాజాగా దీనిపై రంగమ్మత్త స్పష్టత ఇచ్చింది. నిన్న 1న ‘ఆస్క్ అనసూయ’ పేరుతో ట్వి్ట్టర్‌లో తన అభిమానులతో అనసూయ ఇంటరాక్ట్ అయ్యింది. దీనిలో భాగంగా ఓ అభిమాని ‘మీ టాటూకు అర్థం ఏమిటి?’ అని అడిగారు. దీనికి అనసూయ సమాధానం ఇస్తూ.. ‘దాని పేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు’ అని చెప్పుకొచ్చింది. అలాగే మరి కొన్ని ప్రశ్నలకు కూడా ఆమె సమాదనాలు ఇచ్చింది.‘మీ మొదటి జీతం లేదంటే పారితోషికం ఎంతని మరో అభిమాని ప్రశ్నించగా తన తొలి వేతనం 5,500 అని అనసూయ సమాధానం ఇచ్చింది.  

More Related Stories