English   

పేట తెలుగు ట్రైలర్ : ఇది కాళీ ఆడించే ఆట

Petta
2019-01-02 07:10:25

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌లుగా తమిళ బాషలో తెర‌కెక్కిన చిత్రం పెట్ట. ఆ సినిమాని పేట పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రమోష‌న్ లో భాగంగా ఇటీవ‌ల ట్రైల‌ర్ త‌మిళ వ‌ర్షెన్‌లో విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత న్యూ ఇయ‌ర్ విషెస్ చెబుతూ తెలుగులో స్నీక్ పీక్ సైతం విడుద‌ల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే కొద్ది సేప‌టి క్రితం తెలుగు వ‌ర్షెన్‌ కి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

తమిళ ట్రైలరే మక్కీకీ మక్కీ దింపినా పూర్తిగా తెలుగు డైలాగ్స్ అలరిస్తున్నాయి. రజినీ ఇమేజ్ కు తగ్గట్లుగా రజినీ స్టైలిష్ మేనరిజంను హైలైట్ చేస్తూ ట్రైల‌ర్‌ కట్ చేశారు. "20 మందిని పంపించాను. అందరినీ చితక్కొట్టి పంపించాడు" అన్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆపై 'కాళీ' పరిచయం, 'వీడు మామూలోడు కాదు' అన్న డైలాగులతో పాటు రజనీ తనదైన స్టయిల్ లో "హహాహా చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట" అనే డైలాగ్. "చూడటానికి చిన్న పిల్లాడిలా చాలా స్టయిల్ గా ఉన్నారు" అని మేఘా ఆకాశ్ అనగా, "స్టయిల్ గా ఉన్నానంట నాచురల్లీ" అని రజనీ సిగ్గు పాడడం కనిపిస్తుంది. సినిమాలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు గాసిప్స్ నడుస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే ఈ చిత్రంలో పూర్తిగా రజనీ నట విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తుంది. అనిరుధ్ సంగీతం అందింస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జ‌న‌వ‌రి 10న విడుదలకానుంది.

More Related Stories