English   

ఎన్టీఆర్ బయోపిక్ కి అంత దమ్ముందా ?

NTR-Biopic
2019-01-02 08:48:36

బాలకృష్ణ మార్కెట్ ఎంత ? ఈయన సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఎంత వసూలు చేస్తాయి ? అసలు బాలయ్య హయ్యస్ట్ మార్కెట్ ఎంత ? ఇప్పుడు ఇదే అనుమానాలు ప్రేక్షకులతోపాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ ఏకంగా 72 కోట్లు జరిగింది. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్లో అతి పెద్ద హిట్టు గౌతమీపుత్ర శాతకర్ణి ఈ చిత్రం 50 కోట్ల షేర్ వసూలు చేసింది. అది కూడా అప్పుడు ఆయన 100వ సినిమా అనే క్రేజ్ శాతకర్ణికి బాగా పనికొచ్చింది. అన్నింటికీ మించి సంక్రాంతికి సినిమా విడుదల అయింది ఇవన్నీ కలిసి సినిమా 50 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు కూడా సంక్రాంతికి తన సినిమాతో వస్తున్నాడు బాలయ్య, ఈసారి ఏకంగా 72 కోట్ల బిజినెస్ ఎన్టీఆర్ బయోపిక్ చేసేయడంతో ఇప్పుడు అందరికీ ఇదొక ప్రశ్నగా మారింది. ఈయన సినిమా అంత వసూలు చేస్తుందా ? ఎన్టీఆర్ బయోపిక్ కి అంత దమ్ముందా అనే అనుమానాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నే ఈ చిత్రాన్ని 55 కోట్లకు అమ్మేశారు ఓవర్సీస్ లో పది కోట్లకు ఎన్టీఆర్ బయోపిక్ ను బేరం పెట్టాడు బాలకృష్ణ. కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కథానాయకుడు బిజినెస్ గురించి ఆసక్తి పుట్టించే వార్తలు వినిపిస్తున్నాయి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం కనుక 72 కోట్లు వసూలు చేస్తే బాలయ్య మార్కెట్ రెండింతలు పెరిగినట్టే. చూడాలిక ఏం జరుగుతుందో ?

More Related Stories