English   

అత్త మాట మీద పంతం...మన్నత్ కధ ! 

Shahrukh-Khan
2019-01-02 17:21:26

బాలీవుడ్ చిత్ర సీమలో ఖాన్ క్యూబ్ సల్మాన్, అమీర్, షారుక్ లు గత మూడు దశాబ్దాలుగా తమ హవా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది వీరిలో ఒకరు కాకపోయినా ఒకరయినా బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటుతూ వస్తున్నారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా కింగ్ ఖాన్ వరస పరాజయాల్లో ఉన్నాడు. అయినా అతడి సంపాదన ఏడాదికి 56 కోట్ల రూపాయలుందని ఫోర్బ్స్ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు తను కొన్న వాటిల్లో అతి ఖరీదైనది బాంద్రాలోని తన ఇల్లట(మన్నత్‌). కొన్నేళ్ల క్రితం షారుక్‌ బాంద్రాలోని సముద్రానికి ఎదురుగా ఉన్న ఇంటిని కొన్నారు. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.200 కోట్లకు పెరగడం విశేషం. 

తాజాగా షా‌రుక్ రేడియో మిర్చీతో ముచ్చటించిన సందర్భంగా ఈ ఇంటి గురించి మాట్లాడారు. తాను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తినని, బంగ్లాలో మాత్రమే నివసించాలనేది ఢిల్లీ వారి అభిప్రాయమని అన్నారు. ఢిల్లీలో ఆర్థికంగా స్థిరపడని వారు సైతం చిన్న బంగ్లాలోనే నివసిస్తుంటారని కానీ ముంబయిలో అలా కాదని, డబ్బున్న వారు సైతం అపార్ట్ మెంట్స్ లోనే నివసిస్తుంటారని కానీ తాను ముంబయికి రాకముందే తన వివాహం జరిగిందని, తన భార్య గౌరీతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉందామనుకుంటే తన అత్త ఒప్పుకోలేదని ఇంత చిన్న ఇంట్లో ఉంటావా అని ఆమె అడిగితే బాంద్రాలోని సముద్రానికి ఎదురుగా ఉన్న మన్నత్ ని  చూసినప్పుడు ఢిల్లీలోని బంగ్లాలు గుర్తొచ్చాయని, అందుకే, ఆ బంగ్లాను కొనుగోలు చేశానని షారూక్ చెప్పుకొచ్చాడు. తాను ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాటిల్లో అతి ఖరీదైనది ‘మన్నత్’  అని అన్నారు.

అయితే అప్పట్లో షారుక్ వ్యవహార తీరు పై ముంబై స్థానికుల నుండి నిరసన వ్యక్తమయ్యింది. షారుక్ 'మన్నత్' సమీపంలో తన వ్యానిటీ వ్యాన్ ను పార్క్ చేసేందుకు ర్యాంప్ నిర్మించారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయన నివాసం లోపల నిర్మించుకుంటే పెద్ద వివాదంగా మారకుండేది. కాని షారుక్ మాత్రం రోడ్డుకు అడ్డంగా ర్యాంప్ నిర్మించడాన్ని ముంబైలోనికొన్ని సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.

More Related Stories