English   

'సైరా' కోసం బడా విలేజ్ సెట్ !

Sye-Raa
2019-01-02 10:35:38

సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయిన చిరంజీవి మళ్ళీ లైన్ లోకి వచ్చి చేసిన ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తుండటం, అది కూడా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తూ ఉండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్వయానా చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకోగా, రీసెంట్ గా హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమ వాతావరణం ప్రతిబింబించేలా ఒక విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. 'నరసింహ రెడ్డి గూడెం' పేరుతో సినిమాలో కనిపింసి ఈ సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పర్యవేక్షణలో రూపకల్పన చేస్తున్నారు. ఈ సెట్ లో చిరంజీవితో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితురుల మీద కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు. వీలయినంత త్వరగా సినిమా పూర్తి చేసి ఈ సమ్మర్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రామ్ చరణ్. 

More Related Stories