English   

అనిల్ రావిపూడి ఏకంగా బాలయ్యని పట్టాడుగా !

Balakrishna
2019-01-02 11:23:58

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'అతనొక్కడే' తర్వాత హిట్ కోసం చాలా సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. ఎట్టకేలకు ఆయన ఎదురు చూపులు ‘పటాస్‌’ చిత్రంతో ముగిశాయి. అప్పటికి కొత్త దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్‌ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రం కళ్యాణ్‌ రామ్‌ తో పాటు అనీల్‌ రావిపూడికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తర్వాత సుప్రీం, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో మంచి ఫాంలోకి వచ్చాడు అనిల్. రాజా ది గ్రేట్‌ సమయంలోనే బాలయ్యతో అనీల్‌ రావిపూడి సినిమా గురించి ప్రచారం జరిగింది. 

గతంలో అనీల్‌ రావిపూడి ఒక కథను బాలయ్యకు వినిపించాడని, ఆ కథతో సినిమాను చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ చిత్రం వర్కౌట్‌ కాలేదు. ‘రాజా దిగ్రేట్‌’ చిత్రం తర్వాత అనీల్‌ వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ల కలయికలో దిల్‌రాజు నిర్మాణంలో ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ మూవీని మొదలెట్టి ఈ సంక్రాంత్ విడుదలకి రంగం సిద్దం చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో గుడ్ న్యూస్ చెప్పాడు అనిల్. 

ఎఫ్ 2 సినిమా తర్వాత బాలయ్యతో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు అనిల్.  ఇటీవ‌ల బాల‌కృష్ణ ను క‌ల‌సి అనిల్ ఒక క‌థ వినిపించాడట‌, క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండ‌టంతో వెంట‌నే ఓకే చెప్పాడట బాల‌య్య‌. ప్ర‌స్తుతం బాలయ్య ఎన్టీఆర్ బ‌య‌పిక్ లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను మూవీ చేయ‌నున్నాడు. తన మూవీస్ లో కామెడీ, యాక్షన్ సీన్స్ తీయడంలో అనిల్ దిట్ట.  మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండనుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More Related Stories