English   

మజ్ను టీజర్...అర్ధరాత్రి బెడ్ రూమ్ లో అదేం పనో !

Akhil
2019-01-02 19:43:09

అఖిల్, హలో చిత్రాలతో సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి డైరెక్టర్ గా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం షూట్ చివరి అంకంలో ఉన్న ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసికుని ఈ జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్స్ విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు నూతన సంవత్సర కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో అఖిల్ తో సవ్యసాచి చిత్రంలో నాగచైతన్యతో జోడీ కట్టిన నిధి అగర్వాల్ జోడి కట్టింది. అర్ధరాత్రి మా బెడ్ రూమ్ లో నువ్వేం చేస్తున్నావు అంటూ మొదలయ్యే టీజర్ అఖిల్ లోని రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తోంది. అప్పుడు అఖిల్ చేత స్ట్రెస్ ఎలా పోగొట్టాలో చెప్పించాడు దర్శకుడు. మొత్తానికి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టేలానే ఉన్నాడు. టీజర్ ఎందుకో కాస్త బోల్డ్ టచ్ ఇచ్చారు మరి. ఇక ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి వేడి అంతా తగ్గాక విడుదల కానుంది కాబట్టి అఖిల్ ఈ సారికి సేఫ్ అనుకుంటా.

More Related Stories