English   

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్... సైంటిఫిక్ థ్రిల్లర్ !

Hrithik-Shankar
2019-01-02 20:06:04

ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ తెర‌కెక్కించిన 2.0 సూపర్ హిట్టైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 800 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 2.0 తరువాత శంకర్ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెలలోనే సంక్రాంతి తరువాత సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే శంక‌ర్ ఇండియ‌న్ 2 త‌ర్వాత బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోష‌న్‌ తో క‌లిసి ఫిక్ష‌న్ చిత్రం చేయ‌నున్నాడ‌ని, ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాక్స్ న‌డుస్తున్నాయని తెలుస్తోంది. 

అసలు ముందు '2.ఓ' సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా హృతిక్ నే శంకర్ సంప్రదించాడట. అయితే అప్పుడు వేరే సినిమాల కమిట్ మెంట్స్ కారణంగా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. హృతిక్ రోషన్ ను సైంటిఫిక్ థ్రిల్లర్ లాంటి సబ్జెక్ట్స్ లో చూడటానికి జనాలి ఇష్టపడతారు గనుక, అందుకు సంబంధించిన కథ ఒకటి సిద్ధం చేసి ఆయనకి వినిపించినట్టు సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్ కథ నచ్చడంతో హృతిక్ కూడా సినిమా మీద పాజిటివ్ గా ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వరలో శంక‌ర్, హృతిక్ కాంబో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజనం సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు క్రిటిక్స్ . మ‌రి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ఎప్పుడో వ‌స్తుందో చూడాలి మరి. 

More Related Stories