English   

తిరుమలలో జాన్వీ...జనాలు గుర్తుపట్టలేదట !

Jhanvi Kapoor Visits Tirumala With Family During New year
2019-01-02 15:51:22

దివంగత సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా తన తండ్రి బోణీ కపూర్ మరియు సోదరి ఖుషీ కపూర్ లతో కలిసి తిరుమల వెంకటేశుని దర్శించుకున్నారు. నూతన ఏడాది సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అలిపిరి మెట్లమార్గంలో నిన్న రాత్రే తిరుమల చేరుకున్న ఆమె మంగళవారం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అయితే మెట్ల మార్గంలో జాన్వీని అభిమానులు గుర్తించలేదు చాలా ఆలస్యంగా గుర్తించాక ఆమెతో మాట్లాడేందుకు, సేల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఆ తర్వాత నేటి ఉదయం దర్శనం కోసం కూడా తల్లిలా చీరకట్టులో గుడికి వెళ్లారు, దాంతో ఆమెను ఎవరు గుర్తు పట్టలేక పోయారు. అచ్చం శ్రీదేవి కూతురులా ఉందే అంటూ ఒకరిద్దరు అనుకున్నారు, ఆ తర్వాత ఆమె పక్కన బోణీ కపూర్ ఉండటం వల్ల జాన్వీని కొందరు గుర్తు పట్టారట. శ్రీదేవి బతికి ఉన్న సమయంలో ఎక్కువగా తిరుమల శ్రీ వారి దర్శననానికి వచ్చే వారు, ఆమె లేకపోయినా భర్త పిల్లలని తీసుకువచ్చి తిరుమల వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నారు. గత ఏడాదిలో ‘ధడక్’ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా నటన పరంగా మాత్రం జాన్వీకి మంచి పేరును తెచ్చి పెట్టింది. 

More Related Stories