English   

ఫోరెన్సిక్ సర్జన్‌ గా అమలా పాల్ !

amala paul play forensic surgeon her next film
2019-01-02 22:59:19

ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌ ని వివాహం చేసుకుని, ఆపై విడాకులు తీసుకున్న అమలాపాల్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా కనిపిస్తోంది. చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్తున్న అమలాపాల్ మార్కెట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆమె తాజా మూవీ  రాట్ స‌న్ మూవీ హిట్ కావ‌డ‌మే కాకుండా ఆమె న‌ట‌న‌కు క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. దీంతో ఆమెకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.  అయితే ఒకప్పుడు గ్లామర్ పాత్రల మీద ద్రుష్టి పెట్టిన ఆమె ఇప్పుడు విభిన్న కథలపై దృష్టిపెట్టింది. అందుకే ఆమె ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలున్న సినిమాలు మాత్రమె ఓకే చేస్తోంది. అభిలాష్‌ పిళ్లై ఇచ్చిన కధ అనూప్‌ పణికర్‌ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఈ సినిమా తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.కేరళకు చెందిన విశ్రాంత పోలీసు సర్జన్‌ డాక్టర్‌ ఉమా నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉమా పాత్రలో అమలాపాల్‌ ను నటింపజేస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోవై, కోయంబత్తూరు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే మార్చిలో ప్రారంభంకానుంద‌ని నిర్మాత‌లు పేర్కొన్నారు.

More Related Stories