English   

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న అమీ జాక్సన్ !

amy jackson gets engaged and shares pic george panayiotou
2019-01-02 23:04:33

‘మదరాసు పట్టణం’ ద్వారా తమిళ సఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమీ జాక్సన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫాలోయింగ్‌లో మాత్రం ఇతర సీనియర్ హీరోయిన్లతో పోటీ పడుతుంటుంది. ఇటీవలే ‘2.0’తో ఆకట్టుకున్న అమీ జాక్సన్ కొత్త ఏడాదిలో తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ న్యూ ఇయర్‌  జాంబియాలో సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి తొలి అడుగు వేసి నూతన సంవత్సరం రోజున ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. జార్జ్‌తో ఉన్న ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసిన అమీ జాక్సన్ ‘1 జనవరి 2019.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఫోటోల‌లో అమీ జాక్స‌న్ డైమండ్ రింగ్‌ ధ‌రించి ఉంది. అమీ పోస్ట్ చేసిన ఫోటోలు చుసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమీ జాక్సన్ ఒకే ఒక్క చిత్రంలో నటించింది, ‘ఎవడు’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటించింది, అయితే ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు రాలేదు. 

More Related Stories