English   

దేవి శ్రీ ప్రసాద్ మీద ఫ్యాన్స్ ఆగ్రహం !

fans fire on devi sri prasad
2019-01-02 23:11:36

దేవి శ్రీ ప్రసాద్ మీద ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఒకప్పుడు ఆయన సంగీతం అందిస్తే ఆ పాటలు కచ్చితంగా ప్రేక్షకుల నోళ్ళలో మార్మోగిపోయింది. కానీ ఇప్పుడు ఆ సినిమా లేదు, ఆయన పాటలు పెద్దగా హిట్ కావడం లేదు. ఇప్పుడు సంక్రాంతికి ఈ రెండు సినిమాలకు సంగీతం అందిస్తే ఈ రెండు సినిమాలో పాటలు కూడా పెద్దగా బయట వినిపించడం లేదు. రెండింటికీ సాదా సీదా మ్యూజిక్ తో సరిపెట్టేశాడు డి.ఎస్.పి. ఇటు చరణ్, అటు వరుణ్ తేజ్ రెండు సినిమాల పాటలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. గతేడాది రంగస్థలం సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్, ఇప్పుడు బోయపాటి సినిమాకు మాత్రం మ్యూజిక్ ఇచ్చినా ఇందులో ఒక్క పాట కూడా ఇప్పుడు బయట వినిపించడం లేదు. సాధారణంగా దేవి నుంచి ఐటమ్ సాంగ్ వచ్చింది అంటే ఆ సంవత్సరానికి అదే ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు వినయ విధేయ రామ సినిమాలో ఐటెం సాంగ్ ఉన్నా కూడా అది తాను స్వయానా పాడినా హిట్ చేసుకోలేకపోయాడు డి.ఎస్.పి. ఇక వరుణ్ తేజ్ వెంకటేష్ ఎఫ్ 2 సినిమా పాటలు కూడా పెద్దగా వినిపించడం లేదు. ఇందులో కూడా బుర్ర అనే పాట తప్పిస్తే పెద్దగా మిగతా పాటలు ప్రభావం చూపించడం లేదు. అసలు కామెడీ సినిమా పైగా దేవి సంగీతం కచ్చితంగా ఓ రేంజ్లో ఉంటుందని ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ చిత్రం పాటల నిరాశ పరుస్తున్నాయి. సంక్రాంతికి ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. జనవరి 11న రామ్ చరణ్ జనవరి 12న వరుణ్తేజ్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు. మొత్తానికి దేవి నుంచి ఊహించిన సంగీతం అయితే ఈ రెండు సినిమాలకు రాలేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం

More Related Stories