English   

అనిల్ రావిపూడి ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇస్తాడట !

anil ravipudi guest role in f2 multi star movie
2019-01-03 07:59:53

క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్ తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ ర‌చ‌యిత అనిల్ రావిపూడి, ఆ మూవీ హిట్ కావ‌డంతో వెంట‌నే సాయి ధరం తేజ్ తో సుప్రీం తీసి మ‌రో హిట్ ను ఖాతాలో వేస‌కున్నాడు. ఇక ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ మూవీ తీసి ముచ్చటగా మూడో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేశాడు. దీంతో వెంకీ, వ‌రుణ్ ల‌తో ఎఫ్ 2 పేరుతో మ‌ల్టీ స్టార‌ర్ కు ద‌ర్శ‌క‌త్వం వహించే ఛాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ పది రోజులు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలతో బిజీగా గడపనుంది. అయితే ఈ సినిమాలో అనిల్ రావిపూడి అతిధి పాత్రలో కనిపంచనున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఆయన 'రాజా ది గ్రేట్' సినిమాలో ఒక పాటలో మెరిశాడు, ఆ సినిమా హిట్ కావడంతో సెంటిమెంట్ గా భావించాడో ఏమో 'ఎఫ్ 2'లోను కనిపించనున్నాడు. క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఉంటుదట. ఆ పాత్ర ద్వారా ఫీమేల్ ఆడియన్స్ కు ఓ సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాడని ఫిలిం నగర్ టాక్. కాగా ఈ సినిమాలో వెంకీ, వరుణ్ సరసన తమన్నా, మెహ్రీన్ లు కథానాయికలుగా నటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

More Related Stories