English   

యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ మిస్సింగ్ !

accidental prime minister trailer missing from youtube
2019-01-03 01:50:45

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన క్షణం నాటి నుండి అది పలు వివాదాలకు కారణమైంది. మన్మోహన్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఆయన వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ గారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ గా అనుపం ఖేర్ నటిస్తుండగా, సంజయ్ బారుగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో వాస్తవలను వక్రీకరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తుండగా, బీజేపీ నేతలు దానికి ప్రతి విమర్శలు చేస్తున్నారు. పద్మావతి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సినిమా మొత్తం చూసి మాట్లాడాలని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ రోజు ట్రైలర్ చూసి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో కనిపించడం లేదట. స్వయంగా ఈ విషయాన్ని మన్మోహన్ పాత్రధారి అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలుత ఈ విషయం తాను గమనించలేదని అభిమానుల నుండి శ్రేయోభిలాషుల నుండి మెసేజ్ లు, కాల్స్ రావడం తో గమనించాలని ఆయన పేర్కొన్నారు. రిలీజ్ అయిన నాటి నుండి ఆ సినిమా ట్రైలర్ ట్రెండింగ్ లోనే ఉంది. కానీ ఇప్పుడు ఆ ట్రైలర్ లేకుండా పోయింది. రిలీజ్ అయినటువంటి ఇప్పుడు వరకు 37 మిలియన్ మంది పైగా ఈ ట్రైలర్ ను వీక్షించారు. అన్ని వ్యూస్ వచ్చిన ట్రైలర్ మిస్ అవడంతో అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ట్రైలర్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా జరిగిందా అనే కోణంలో ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మన్మోహన్ ఒప్పుకుంటే ఆయనకి స్పెషల్ స్క్రీనింగ్ వేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని అనుపమ్ ఖేర్ చెబుతున్నారు. మరి ఈ వివాదం ఇంకెంత జరుగుతుందో వేచి చూడాలి ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

More Related Stories