English   

ఈ టైటిల్ సెంటిమెంట్ లు వర్కవుట్ అయ్యేనా ?

Suriya's upcoming film with director KV Anand gets a wacky title
2019-01-03 10:57:58

సాధారణంగా అందరికీ ఎదో ఒక సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. పిల్లి ఎదురొస్తే పనులు సరిగ్గా అవ్వవని, తుమ్మితే బయటకి వెళ్ళకూడదు అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. సినిమాల విషయానికి వస్తే కొందరు హీరోలకి టైటిల్ సెంటిమెంట్ ఉంటె మరికొందరికి డైరెక్టర్ సెంటిమెంట్ ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి తెలుగులో గోపీ చంద్ కి అం సెంటిమెంట్ ఉంది. ఆయన వరసగా జయం, నిజం, వర్షం, యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం, లౌక్యం, సౌఖ్యం, పంతం ఇలా అం సెంటిమెంట్ తో టైటిల్స్ పెడుతూ వచ్చాడు. ఇందులో హిట్ ఎన్ని ఫట్ ఎన్ని అనేది తర్వాత సంగతి. ఇక తమిళ అజిత్ గతంలో 'వి' అక్షరంతో వాలి, విలన్, వీరం, వేదాళం, వివేగం లాంటి చిత్రాలు చేశాడు. ఈ చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇవ్వ‌డంతో త‌న తాజా చిత్రానికి కూడా మొద‌ట లెట‌ర్ వి ఉండేలా చూసుకున్నాడు. టైటిల్ కి నప్పుతుంది లేదో తెలీదు కానే విశ్వాసం అనే టైటిల్‌ తో ఫిక్స్ అయిపోయాడు. అలాగే సూర్య కూడా ఇక సూర్య విష‌యానికి వ‌స్తే ఆయ‌నకి న్ సెంటిమెంట్. గతంలో కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య అయ‌న్‌, మాట్రాన్ పేర్లతో సినిమాలు చేస్తే అయ‌న్ మంచి విజ‌యం సాధించగా, మాట్రాన్ మాత్రం నిరాశ‌ప‌ర‌చింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతుండగా దానికి కాప్పాన్ అనే టైటిల్‌ ని ఫిక్స్ చేశారట. అయితే ఈ చిత్రానికి గ‌త చిత్రాల మాదిరిగానే ‘న్‌’ సెంటిమెంట్‌తో ఈ చిత్రానికి ‘కాప్పాన్‌’ అనే టైటిల్ పెట్ట‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ‘న్‌’ సెంటిమెంట్ కేవీ ఆనంద్‌- సూర్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories