English   

బోయ‌పాటి శ్రీను ఏం చెప్పాల‌నుకుంటున్నాడు..?

Boyapati Srinu  about ram charan's Vinaya Vidheya Rama Movie
2019-01-03 11:36:40

బోయపాటి శ్రీను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎలాంటి సినిమా చేశాడో ప్రేక్షకులకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఓ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ రోజుకొక కొత్త పోస్టర్ విడుదల చేస్తున్నాడు. అదే సమయంలో హాలీవుడ్ సినిమాల్లో కనిపించే రాంబోను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడు. ఇందులో రామ్ చరణ్ లుక్ కు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడు మెగా వారసుడు. సిక్స్ ప్యాక్.. చేతిలో గన్ ఇలా కొత్తగా మ్యాచో లుక్ తో మాయ చేస్తున్నాడు చరణ్. దానికి తోడు మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న పోస్టర్స్, పాటలు విడుదలవుతున్నాయి. ఇంకోవైపు హీరోయిన్ తో రొమాంటిక్ పోస్టర్స్ కూడా వ‌స్తున్నాయి.. ఇలా ఒకే సినిమాలో చాలా కవర్ చేస్తున్నాడు బోయపాటి. ఇవన్నీ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి మరింతగా పెరిగిపోతుంది.
జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ‌ విడుదల కానుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల్లో సింహభాగం రామ్ చరణ్ సినిమాదే. ఈ చిత్ర బిజినెస్ దాదాపు 90 కోట్లు జరగడంతో అందరి క‌ళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. చరణ్ కూడా కచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాన‌ని ధీమాతో కనిపిస్తున్నాడు. దృవ, రంగస్థలం లాంటి సినిమాల తర్వాత ఆయన చేసిన సినిమా ఇది. దాంతో కచ్చితంగా వరుసగా మూడో విజయం అందుకొని తన రేంజ్ ఇంకా పెంచుకుంటాను అంటున్నాడు రామ్ చరణ్. మరోవైపు బయటికి వినయ విధేయ రామ విజయం బోయ‌పాటికి కూడా కీలకంగా మారింది. జయ జానకి నాయక ఫ్లాప్ కావడంతో ఇప్పుడు తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు ఈ మాస్ డైరెక్టర్.

More Related Stories