English   

రామున్ని చెడ్డ‌బాలుడుగా మార్చేస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్..

Ram Pothineni turns to negative role in director Puri Jagannadh's next film
2019-01-03 11:46:00

పూరీ అనుకోవాలే కానీ ఏదైనా చేయ‌గ‌ల‌డు.. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి పూరి జగన్నాథ్ ను బ్యాడ్ బాయ్ ఇమేజ్ కాపాడుతుందా.. అసలు ఈయ‌న‌ సినిమాలకు ఇప్పుడు క్రేజ్ ఉందా లేదా.. ఒకప్పుడు ఈ డేరింగ్ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుంది అంటే మాస్ ఆడియన్స్ పండగ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. పూరి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దానికి కారణం కూడా ఈయనే. టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి నుంచి చెప్పుకోదగ్గ సినిమా రాలేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మధ్యలో ఆయన చేసిన చాలా సినిమాలు కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. అంత దారుణమైన సినిమాలు చేస్తున్నాడు పూరీ. ఇక తన వారసుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన మెహబూబా సినిమా కూడా డిజాస్టర్ కావడంతో పూరి చాలా రోజులు బ్రేక్ తీసుకున్నాడు. సాధారణంగా ఈ సినిమా పూర్తి కాగానే మరో సినిమాను వెంటనే మొదలు పెట్టే అలవాటు ఉన్న పూరి జగన్నాథ్ ఈ సారి మాత్రం ఆరు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్నాడు.
మధ్యలో చాలా మంది హీరోలను కథలు చెప్పి ఒప్పించాలని ప్రయత్నించినా కూడా ఎవరు నమ్మలేదు. దాంతో మళ్ళీ కొడుకుతోనే సినిమా చేస్తాడేమో అని అంతా అనుకుంటున్న తరుణంలో రామ్ లాంటి హీరోను పట్టుకున్నాడు పూరి జగన్నాథ్. త్వరలోనే ఈయనతో సినిమా తెరకెక్కించబోతున్నాడు పూరి. రెగ్యులర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొదలు కానుంది. ఇది పూరికి 35వ‌ సినిమా.. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టి చూపిస్తారని ధీమాగా చెబుతున్నాడు ఈ మాస్ డైరెక్టర్. ఇందులో హీరో పూర్తిగా బ్యాడ్ బాయ్ గా కనిపించబోతున్నాడు రామ్. ఈ సినిమా కోసం కొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నాడు ఈయన. ఈ విజయం రామ్ కు కూడా కీలకంగానే మారింది. హలో గురు ప్రేమకోసమే సినిమా ఏదో యావ‌రేజ్ అయింది కానీ కోరుకున్న హిట్ అయితే కాదు. మొత్తానికి ఈ కాంబినేషన్లో రానున్న సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో అని ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారిప్పుడు.

More Related Stories