English   

నిర్మాత‌ల ఆస్తులు అమ్మించేస్తున్న ప్ర‌భాస్..

prabhas next film with kgf movie director Prashanth Neel
2019-01-03 11:57:16

ఒకప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతల పండగ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా పండగ చేసుకుంటున్నారు.. కాకపోతే కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ తెలుగు హీరో కాదు.. త‌నతో సినిమా చేయాలంటే అప్పట్లా 50 కోట్లు ఉంటే సరిపోదు.. ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు అంటే కనీసం 200 కోట్లు ఉండాలి. అప్పుడు గాని ఈ సినిమాను పూర్తి చేయడం సాధ్యం కాదు. బాహుబలి తర్వాత పెరిగిన తన రేంజ్ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. చేసే ప్రతి సినిమా కనీసం 200 కోట్ల బడ్జెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా నటిస్తున్న రెండు సినిమాలు కూడా దాదాపు అదే బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. సాహో సినిమా ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎవరూ చేయనటువంటి యాక్షన్ ఎంటర్టైనర్. సుజిత్ ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే రాధాకృష్ణ కుమార్ సినిమా కూడా 1960ల నేపథ్యంలో సాగే కథ.
దీనికోసం భారీ సెట్టింగ్ లు వేస్తూ దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు యువీ క్రియేష‌న్స్. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ మరో భారీ సినిమాకు ముహూర్తం పెడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న కే జి ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే కథ విన్న ప్రభాస్ బౌండెడ్ స్క్రిప్ట్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఇది కుదిరితే రెండు వందల కోట్లతో ఈ సినిమా నిర్మించడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గతంలో ప్రభాస్ తో ఈయ‌న నిర్మించిన మున్నా సినిమా అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు. ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు కలుస్తుందో చూడాలి

More Related Stories