English   

వైఎస్ రాజారెడ్డిగా జగపతిబాబు అదుర్స్..!!

Jagapathi-Babu
2019-01-03 08:42:46

సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో జగపతిబాబు ఫ్యామిలీ హీరోగా రాజ్యమేలాడు. ఒకరకంగా శోభన్ బాబు వారసుడు ఆయనే అన్నంత పేరు కూడా వచ్చింది. అలాంటి సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ పాత్రలలో నటించిన హీరో క్రూరంగా కనిపించే విలబ్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బోయపాటి పుణ్యమా అంటూ లెజెండ్ సినిమా ద్వారా పవర్ఫుల్ విలన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు జగపతిబాబు. ఆయన విలన్ గా నటించిన రంగస్థలం, రవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 

తాజాగా ఆయన తమిళ విశ్వాసం మూవీ లో కూడా తన నటవిశ్వరూపాన్ని చూపారని మనకి ట్రైలర్ లోనే అర్థం అయిపోతుంది. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర నుండి ఆయన ఫస్ట్లుక్ రిలీజ్ అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముఖ్య ఘట్టాలతో తెరకెక్కిస్తున్న చిత్రమే యాత్ర. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రను మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి పోషిస్తుండగా, ఆయన తండ్రి పాత్ర ఆయన తండ్రి పాత్రను వైయస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, డైలాగ్స్ టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ యాత్ర సినిమా మీద అంచనాలు పెంచేశాయి. తాజాగా వైయస్ రాజారెడ్డిగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్. నిజంగా రాజారెడ్డి ఎలా ఉన్నారో దాదాపు అన్ని పోలికలతో జగపతిబాబుని తయారుచేసాడు డైరెక్టర్. సెవెంటీ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories