English   

రండి బాబూ రండి.. దీపిక ప‌దుకొనే దోశ తినండి.. 

Deepika-Padukone
2019-01-03 09:32:24

కారం దోశ.. మసాలా దోశ.. ఆనియన్ దోశ‌.. ఇలా చాలా రకాల దోశ‌లు మనం చూసే ఉంటాం. ఇష్టంగా తింటాం కూడా. కానీ ఇప్పుడు మరో దోస కూడా వచ్చేసింది మెనూలోకి. అది దీపికా పదుకొనే దోస.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు మన ముద్దుగుమ్మ దోశ‌ అమెరికాలో బాగా ఫేమస్. టెక్సాస్ నగరంలో అక్కడ టెక్సాస్ నగరంలో రెస్టారెంట్లో దీపికా దోశ‌ అంటూ హల్ చ‌ల్ చేస్తున్నారు రెస్టారెంట్ ఓనర్లు. మెనూ లో కూడా ఈ దోశ‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో దీపిక అభిమానులు ఎగబడి మరి ఈ దోశలు తింటున్నారు. దీపిక క్రేజ్ ఇలా వాడుకుంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ నోట ఈ నోట పడి దీపిక గురించి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. 

మన హీరోయిన్ గురించి ఇండియాలో క్రేజ్ అంటే తప్పులేదు.. కానీ అమెరికాలో కూడా ఈ స్థాయి గుర్తింపు ఉండటం నిజంగా గొప్ప విషయమే. పైగా అక్కడ ఆమె పేరుతో ఒక ఫుడ్ ఐటమ్ ఉండడం మరింత సంచలనం. దీపిక కూడా తన పేరు మీద ఉన్న దోష గురించి తెలుసుకొని నవ్వుకుంటుంది. వీలుంటే తింటానని చెబుతోంది. ఇప్పటివరకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక దోశ‌ చూశాం.. అదే చిరంజీవి స్టీమ్ దోశ. హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్ లో ఇది దొరుకుతుంది. దీనికి పూర్తి హక్కులు చిరంజీవి ద‌గ్గ‌రే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే దీపిక ప‌దుకొనే దోశ వ‌చ్చింది. మరి ఈ భామ దోశ‌ ఇండియాలో కూడా వస్తుందో లేదో చూడాలి.

More Related Stories