English   

 'ఇస్మార్ట్ శంకర్' గా రామ్...పూరీ మాస్ !

Ram
2019-01-03 10:04:44

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి స్వయంగా ఈ సినిమా నిర్మిస్తుండగా చార్మీ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమాకి ముందు పండుగాడు అనే టైటిల్ ఖ‌రారు చేశార‌న్న వార్త‌లొచ్చాయి. అయితే కొద్ది సేపటి క్రితం ఇప్పుడు కొత్త టైటిల్ ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఈ సినిమాకి `ఇస్మార్ట్ శంక‌ర్‌` అనే పేరు ఖ‌రారు చేశారు. ‘డ‌బుల్ సిమ్ కార్డ్‌’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌ని కొద్ది సేప‌టి క్రితం చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ‘ఇస్మార్ట్‌… ఇస్మార్ట్ శంక‌ర్‌’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ తో మోష‌న్ పోస్ట‌ర్ క‌ట్ చేశారు. రామ్ లుక్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, గెడ్డంతో సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే రామ్ పాత్ర స్వభావం కూడా డిఫరెంట్ గా ఉండేలా అనిపిస్తోంది. ఈమ‌ధ్య పూరి, రామ్ ఇద్దరి కెరీర్లూ ఊగిస‌లాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ‘ఇస్మార్ట్’గా వీరిద్ద‌రూ హిట్ కొడతారేమో ? త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  

More Related Stories