English   

బన్నీకి హీరోయిన్ దొరికేసినట్టే !

Kiara-Advani
2019-01-03 18:08:50

‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కైరా అద్వాని ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా కైరా అద్వానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స, హారిక అండ్ హాసిని సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమా సన్నాఫ్ సత్య మూర్తి లాగా తండ్రీ కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ సబ్జెక్ట్ అని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  హీరోయిన్ పాత్ర కోసం త్రివిక్రమ్ ఆమెని సంప్రదించారట. బన్నీ జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, బన్నీ సినిమాకి ఖరారైపోయినట్టేనని అనుకుంటున్నారు.  ఇక ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమా ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. 

More Related Stories