English   

లక్ష్మీ పార్వతి చేతిలో ఎన్టీఆర్ బయోపిక్....రిలీజ్ డౌటే !

NTR-Kathanayakudu
2019-01-03 19:53:47

టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు నుండే ఈ సినిమా మీద వివాదాలు ముసురుతూనే ఉన్నాయి, ఒక పక్క లక్ష్మి పార్వతి ఈ సినిమా మీద విమర్శలు చేస్తుండగా మరోపక్క నాదెండ్ల భాస్కర్ రావు కూడా తనను విలన్ గా చూపితే సినిమా ఆపేస్తానంటూ హెచ్చరికలు జరీ చేస్తున్నారు. అయితే వీరిద్దరినీ అందరూ లైట్ తీసుకున్నారు. వీళ్ళ బొంద వీళ్ళెం చేస్తారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరే ఆ సినిమా విడుదలకి పిల్లర్స్ లా మారే పరిస్థితి ఏర్పడింది. 

అదేంటి అంటారా?. సినిమా విడుదలకి అన్నీ సిద్దం చేసుకున్న చోత్ర యూనిట్, ఈరోజు సినిమాని సెన్సార్ ముందుకు అలా పంపితే ఇలా సెన్సార్ పూర్తి చేసుకుని వచ్చేస్తుంది అని అనుకుంటున్న తరుణంలో సెన్సార్ వాళ్ళు పెను షాక్ ఇచ్చారని చెబుతున్నారు. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసినా కూడా సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇద్దరు పాత్రలకు సంబందించిన వ్యక్తుల నుండి  NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)' తీసుకురావాలని కండిషన్ పెట్టారట. 

వారిలో ఒకరు ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి - అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నాదేండ్ల భాస్కర్ రావులు. వీరిద్దరూ ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన వ్యక్తులన్న సంగతి అందరికి తెలిసిందే. వారిద్దరి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తేనే  సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది.  అయితే అయితే నాదెండ్ల భాస్కరరావు నుంచి NOC తీసుకురావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అసలు చిక్కు లక్ష్మీపార్వతి నుంచే ఎదురవచ్చనే భావిస్తున్నారు.  ఒకవేళ NOC తేలేకపోతే సినిమా రిలీజ్ కి ఇబ్బందే.

More Related Stories