English   

కొత్త చ‌రిత్ర‌కు తెరతీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ బిజినెస్.. 

KATHANAYAKUDU MAHANAYAKUDU Pre Release BUSINESS
2019-01-03 14:45:26

ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని బాలయ్య ఏ ముహూర్తంలో మొదలు పెట్టాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే కొత్త చరిత్రకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 72 కోట్లు జరగడం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. బాలయ్యకు ఇంత మార్కెట్ ఎక్కడ ఉంది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇక్కడ బాలయ్య ఇమేజ్ తో పాటు అన్న గారి క్రేజ్ కూడా బాగానే పనికి వస్తుంది. ఇదిలా ఉంటే కథానాయకుడు డిజిటల్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడైన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అమెజాన్ సంస్థ కథానాయకుడు రైట్స్ ను 25 కోట్లకు కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. 
ఇక మహా నాయకుడు కూడా దాదాపు 20 కోట్లకు బేరం పెట్టాడు బాలయ్య. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 50 కోట్ల వరకు రైట్స్ రూపంలో రావడం బాలయ్య తెలివితేటలకు నిదర్శనం. నిర్మాతగా ఆయన తొలి సినిమాతోనే సంచలనం సృష్టిస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో పెట్టిన బడ్జెట్ లో విడుదలకు ముందే వెనక్కి తెచ్చుకుంటున్నాడు బాలకృష్ణ. రెండు సినిమాలకు కలిపి దాదాపు 70 కోట్లకు పైగా పెట్టిన బాలయ్య వాటిని కేవలం రైట్స్ రూపంలోనే వెనక్కి తీసుకొస్తున్నాడు. దానికి తోడు ఇంకా థియేట్రికల్ రైట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వస్తే విడుదలకు ముందే దాదాపు 100 కోట్లు బాలయ్య ఖాతాలో చేరిపోయినట్లే. సినిమా విడుదలైన తర్వాత విజయం సాధించింది అంటే అది మరో బోనస్. మొత్తానికి అన్నగారి సినిమాతో ఎప్పుడు లేని లాభాలు చూస్తున్నాడు బాలకృష్ణ.

More Related Stories