English   

బాహుబలికి రియల్ లైఫ్ విలన్లు ఎలా ఉంటారో తెలియదు ! 

highcourt interesting comments on prabhas guest house issue
2019-01-03 21:59:30

సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను కొద్ది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈరోజు ప్రభాస్ పిటిషన్ విచారణ సందర్భంగా,  విచారణ లో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తొలుత ప్రభాస్ భూకబ్జాదారుడంటూ ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యానించగా ఈ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ ఎవరైనా భూమిని కబ్జా చేస్తే సెక్షన్ 17 కింద నోటీసులు ఇచ్చి, విచారణ జరపాలని అది చేయకుండా భూకబ్జాదారుడంటూ వ్యాఖ్యానించడం సరి కాదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ వాదిస్తూ, ప్రభాస్ కు అనుకూలంగా తీర్పును ఇస్తే అక్కడి భూమిని కబ్జా చేసిన ఇతరులు కూడా అర్హులవుతారని చెప్పిన నేపథ్యంలో, ప్రభాస్ తరపు లాయర్ వాదిస్తూ, ఆ భూమిని ప్రభాస్ కొనుగోలు చేశారని, కొనుక్కున్న భూమిలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని కోర్టుకు తెలిపారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు, రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్ లో విలన్లు ఎలా ఉంటారో తెలియకపోయి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చేవారమని ప్రభాస్ సెలబ్రిటీ కావడంతో అతని విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించామని చెప్పింది. 

More Related Stories