English   

నేను మంచోన్ని.. ఏ హీరోయిన్ తో ఎఫైర్ లేదంటున్న అనిల్..

anil ravipudi responded on affair with heroine
2019-01-04 09:00:12

ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అన్నింటికీ సిద్దపడాలి. ఇక్కడ మేము బుద్ధిమంతులు.. క్లీన్ ఇమేజ్ కావాలి.. మాపై రూమర్లు రావద్దు అంటే సరిపోదు. ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఇమేజ్ పాటు డామేజ్ కూడా వస్తుంది. దీనికి సిద్ధపడ్డప్పుడు దానికి కూడా రెడీ గానే ఉండాలి. అనిల్ రావిపూడి కి విషయం కాస్త ఆలస్యంగా అర్థమయింది. ఈ దర్శకుడికి కొన్ని రోజులుగా ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనిపై మౌనంగానే ఉన్న  అనిల్ ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. తనకు ఏ హీరోయిన్ తో ఎలాంటి ఎఫైర్ లేదని దయచేసి అలాంటి తప్పుడు వార్తలు రాయోద్దు అంటూ మీడియాను కోరుతున్నారు ఈ కుర్ర దర్శకుడు. తనకు కూడా ఓ ఫ్యామిలీ ఉందని.. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తారని చెబుతున్నాడు అనిల్ రావిపూడి.
అంతేకాదు తాను ఏ హీరోయిన్ కూడా రికమెండ్ చేయట్లేదని.. అలాంటి సంస్కృతిని తాను అస్సలు ఎంకరేజ్ చేయనని చెబుతున్నాడు అనిల్. ఈయనకు కొన్నేళ్లుగా మెహ్రీన్ కౌర్ తో ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతోంది. రాజా ది గ్రేట్ త‌ర్వాత ఇప్పుడు ఎఫ్ 2 సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. దాంతో నిజంగానే అనిల్, మెహ్రీన్ కు మ‌ధ్య‌ ఏదో ఉందనే వార్తలు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి. ఈ విషయంపైన ఇప్పుడు అనిల్ స్పందించాడు. మొత్తానికి ఇన్నాళ్లూ క్లీన్ ఇమేజ్ తో ఉన్న ఈ దర్శకుడికి ఇప్పుడు చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. మరి దీని నుంచి ఎలా బయట పడతాడు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.

 

More Related Stories