English   

త‌న కొడుకు గురించి చెప్పిన హ‌న్సిక‌..

hansika motwani talks about her son
2019-01-04 02:17:30

కొత్త సంవత్సరంలో అందరూ తమ తమ కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే హన్సిక కూడా చెప్పింది. అయితే ఈ భామ కోరిక విన‌గానే అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె కోరిన కోరిక కూడా అలాగే ఉంది మరి. తన కొడుకు పదో తరగతి మంచి మార్కులతో బయటపడాలని కోరుకుంది హన్సిక. అసలు ఈ బామ‌కు పెళ్లి ఎప్పుడూ అయింది.. మొన్నే కదా పాతికేళ్లు దాటింది అప్పుడే పదో తరగతి చదివే కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు.. అనేగా మీ అనుమానం. దీనికి కూడా సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హన్సిక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటుంది. తనకు వచ్చిన ఆదాయంలో చాలావరకు అనాధ శరణాలయం వైపు మళ్ళిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇందులో భాగంగానే 34 మందిని చదివిస్తుంది హన్సిక. అక్కడ ఓ కుర్రాడు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తన అనాధ శరణాలయంలో ఉండే పిల్లలు అందరినీ తన పిల్లలుగానే భావిస్తుంది హన్సిక. అందుకే ఈ పదో తరగతి చదివే కుర్రాడిని తన కొడుకు గానే భావించి మంచి మార్కులతో పాస్ కావాలని దేవున్ని కోరుకుంది ఈ భామ‌. హ‌న్సిక కోరిక విన్న తర్వాత కాస్త వింతగా అనిపించినా కూడా దాని వెనుక ఉన్న కథ తెలిసిన తర్వాత అమ్మడి పై గౌరవం పెరిగిపోతుంది. లేదంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు చెప్పండి. తన వాళ్ళు కానివాళ్ల కోసం కూడా ఇంతలా ఆరాట పడుతున్న హన్సిక మనసును చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అన్నట్లు ఈ అనాధ పిల్లల కోసం ముంబైలో ఒక ఆశ్రమం కడుతుంది హన్సిక. ప్రస్తుతం ఈమె తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

More Related Stories