English   

పూరీని ఇస్మార్ట్ శంక‌ర్ ఏం చేస్తాడో..?

Puri Jagannadh Ram Pothineni's film iSmart Shankar
2019-01-04 02:44:04

పూరి జగన్నాథ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నాడు. చాలా కొత్త కథలు ఈ మధ్య కాలంలో ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు ఈ డైరెక్టర్. దాంతో మళ్ళీ పూర్తిగా పోకిరి రోజుల్లోకి వెళ్లిపోతున్నాడు ఈ దర్శకుడు. అప్పట్లో తాను ఎలాంటి సినిమాలు చేసేవాడో మళ్లీ అలాంటి కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు రామ్ తో ప్లాన్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో రామ్ పూర్తిగా బ్యాడ్ బాయ్ పాత్ర‌లో నటించబోతున్నాడు. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో పూరి సినిమాలతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని హామీ ఇస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం అంటున్నాడు ఈ దర్శకుడు.
మరోవైపు రామ్ కూడా ఎందుకో తెలియదు కానీ పూరిని కూడా బలంగా నమ్మేశాడు. సంక్రాంతి తర్వాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కచ్చితంగా ఈ సినిమాతో పూరి ఏదో ఒక మాయ చేస్తాడని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ లో కథ గురించి గాని హీరో రామ్ క్యారెక్టర్ గురించి గాని ఎలాంటి క్లూ ఇవ్వలేదు. కానీ కచ్చితంగా ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నాడు పూరి జగన్నాథ్. తన నమ్మకం చూస్తుంటే ఈసారి కచ్చితంగా ఏదో చేస్తాడని అనిపిస్తుంది. మొత్తానికి చూడాలి మరి ఇస్మార్ట్ శంకర్ అయిన పూరి ఆశలను తీరుస్తుందో లేదో.

 

More Related Stories